
దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైలు ప్రయాణికులలో చాలామందికి ఫ్రీ వైఫై సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అయితే తాజాగా రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశంలోని 6115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సేవల ద్వారా సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.
రైల్వే స్టేషన్ పరిసరాలలో ఆఫీస్ వర్క్ చేయాలనీ భావించే వాళ్లకు సైతం ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. రైల్ టెల్ సహాయంతో ఈ సేవలను అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సదుపాయాలను అందించే విషయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
స్మార్ట్ ఫోన్లలో మొదట వైఫై మోడ్ ను ఆన్ చేసి ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత రైల్ వైర్ వైఫై నెట్వర్క్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అందులో ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి మొబైల్ ఫోన్ కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ వివరాలను ఎంటర్ చేయాలి. మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఈ సర్వీసులను సులువుగా పొందవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు