వస్తు, సేవలను కొనుగోలు చేయాలంటే సామాన్యుడు సైతం ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక వస్తువు ధర పెరుగుతుండటంతో వినియోగదారుల్లో ఆందోళన అయితే పెరుగుతోంది. బంగారం, వెండి ధరల పెరుగుదల సైతం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తుంది. బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతుండటం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు టెన్షన్ ను పెంచుతోంది.

ధన త్రయోదశి, దీపావళి పండుగలు వస్తున్న సమయంలో బంగారం ధరలు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. గత ఐదేళ్ళలో బంగారం, వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. బంగారం ధరతో పోల్చి చూస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. పరిశ్రమల్లో వెండి వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో వెండికి డిమాండ్ పెరుగుతోంది.

సాధారణంగా పండుగల సమయంలో ఎక్కువమంది బంగారం కొంటారు. అయితే ఇప్పుడు మాత్రం బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కనీసం ఒక్క గ్రామ్ అయినా బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే బంగారం ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేయలేక నెట్టుకొస్తున్నారు. మరోవైపు బంగారంపై రాబడి ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలామంది బంగారానికి బదులుగా ఇతర వస్తువులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లు బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్ అయితే లేదని చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెడితే మంచి రాబడికి అవకాశం అయితే ఉంటుంది. అయితే బంగారం ధరలు మరీ ఎక్కువ కావడంతో సాధారణ, మధ్య తరగతి వర్గాల ప్రజలు పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: