ఆరోగ్యకరమైన జీవనశైలికి గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు గుండె ఆరోగ్యానికి అమృతంతో సమానం. వీటిలో ఉండే విటమిన్ కె, ఖనిజాలు రక్తనాళాలను రక్షించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే వాల్‌నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

మనం నిత్యం వాడే వెల్లుల్లి కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. పండ్ల విషయానికి వస్తే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీ జాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అదేవిధంగా ఓట్స్ వంటి తృణధాన్యాలు శరీరంలోని పీచు పదార్థాన్ని పెంచి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. చేపలు తినే అలవాటు ఉన్నవారికి సాల్మన్, ట్యూనా వంటి రకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తాయి.

వీటితో పాటు రోజువారీ ఆహారంలో చిక్కుళ్లు, బీన్స్ చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి గుండెపై భారం తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ వాడకం కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ పరిమితంగా తీసుకోవడం వల్ల దానిలోని ఫ్లేవనాయిడ్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెను మరింత దృఢంగా మార్చుకోవచ్చు. ఈ పోషకాహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చు. గుండె పోటు  సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: