ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో వికారాబాద్ కూడా ఒకటి అని చెప్పొచ్చు...ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువసార్లు విజయం సాధించింది. దివంగత మర్రి చెన్నారెడ్డి లాంటి వారు కూడా వికారాబాద్ నుంచి గెలిచారు. వికారాబాద్ నియోజకవర్గం ఏర్పాడ్డాక ఇక్కడ కాంగ్రెస్ మొత్తం 7 సార్లు గెలవగా, టీడీపీ నాలుగు సార్లు గెలిచింది..ఇక 2004లో కాంగ్రెస్‌తో పొత్తుతో టీఆర్ఎస్ వికారాబాద్‌లో గెలిచింది.

అయితే 2008లో టీఆర్ఎస్ పొత్తు నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో వచ్చిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు...2009 ఎన్నికల్లో కూడా ఆయనే వికారాబాద్ బరిలో గెలిచారు...అలాగే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ప్రసాద్ కుమార్‌పై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజీవరావు విజయం సాధించారు.

ఇక సంజీవరావు పనితీరు బాగోకపోవడంతో 2018లో కేసీఆర్ సీటు ఇవ్వలేదు..ఈ క్రమంలోనే యువ నేత మెతుకు ఆనంద్‌కు సీటు దక్కగా, ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. గడ్డం ప్రసాద్ కుమార్‌పై కేవలం 3 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు...ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంద్...దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు..ప్రజలతో టచ్‌లోనే ఉంటున్నారు..అలాగే నియోజకవర్గంలో మంచిగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు...ఇక ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే దళితబంధు అమలులో ఇబ్బందులు వచ్చాయి...ఎమ్మెల్యే తనకు కావల్సిన వారికే పథకం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయంగా చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్‌కు పెద్ద ప్లస్ ఏమి లేదు...ఏదో కేసీఆర్ ఇమేజ్ అనేది ఆయనకు ప్లస్‌గా ఉంది...సొంతంగా బలం ఏమి పెంచుకోలేదు..అటు కాంగ్రెస్ తరుపున ప్రసాద్ కుమార్ పనిచేస్తున్నారు...గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఉంది. ఏదేమైనా ఈ సారి వికారాబాద్‌లో కారు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: