నిత్యం ప్రజల్లో ఉంటూ, వారికి ఏమన్నా సమస్యలు వస్తే అండగా నిలబడే నేతలు ఈరోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. అయితే అలా అరుదుగా ప్రజలకోసం నిలబడే నాయకుల్లో అనంతపురం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అయితే తన తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి కూడా ధర్మవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2004 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.

 

ఇక 2006లో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి హత్యకు గురికావడంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ డీఆర్‌యుసీసీ, అటవీ అభివృద్ధి శాఖ, ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత వైసీపీలోకి వచ్చేసి, 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఓటమి పాలైన కూడా నియోజకవర్గంలోనే పనిచేసుకుంటూ వచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ మరోసారి అవకాశం ఇవ్వగా, కేతిరెడ్డి 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి..ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ...ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రభుత్వం తరుపున ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు కలిగిన కూడా ధైర్యంగా ముందుకొచ్చి, అధికారులతో మాట్లాడి సమస్యలని పరిష్కరిస్తున్నారు.

 

ఇక ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలని పార్టీలకు అతీతంగా అందేలా చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అలాగే నియోజకవర్గంలో పిలిచిన ప్రతి ఒక్కరి శుభకార్యాలకు హాజరవుతున్నారు. ప్రతిరోజూ ఉదయం సమయంలో ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ప్రోగ్రాం పెట్టుకుని నియోజకవర్గ పరిధిలో ఏదొక వూరులో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

 

అటు టీడీపీ పరిస్తితి ఇక్కడ అంతగా బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) బీజేపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ టీడీపీని నడిపించే బాధ్యతలు పరిటాల ఫ్యామిలీ తీసుకుంది. అయితే వారు కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్ల, టీడీపీ కార్యకర్తలు కేతిరెడ్డి వైపుకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులని బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: