అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని పలు సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే అధికారం ఉండటంతో స్థానిక ఎన్నికలు వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. కానీ అవి పక్కనబెడితే క్షేత్ర స్థాయిలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అలా ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ గాలిలో గెలిచిన శ్రీదేవి...గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మినహా...కొత్తగా శ్రీదేవి చేసింది ఏమి లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అంశం శ్రీదేవికి అతి పెద్ద మైనస్. సరే వైసీపీ ప్రభుత్వం ఎలాగో మూడు రాజధానులని అంటుంది....కానీ శ్రీదేవి తన నియోజకవర్గ ప్రజలకు నచ్చజెప్పాల్సిన అవసరముంది. వారికి ఇబ్బందులు ఏమున్నాయో అవి తెలుసుకుని, సి‌ఎం జగన్‌తో చెప్పి పరిష్కరించడానికి కృషి చేయాలి.

కానీ శ్రీదేవి అలాంటి కార్యక్రమం ఏమి చేయడం లేదు. పైగా నియోజకవర్గంలో కూడా పెద్దగా ఉండేది లేదని తెలుస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఇసుక, ఇళ్ల స్థలాల్లో లెక్కలేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అటు శ్రీదేవి స్వయంగా...పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇక సొంత పార్టీ ఎంపీ నందిగం సురేష్‌తో శ్రీదేవికి పెద్దగా పడటం లేదు. అటు సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండ దక్కించుకోవాలని చూస్తున్నారు. సురేష్ కూడా కన్ను కూడా తాడికొండపైనే పడిందని తెలుస్తోంది. ఇలా ప్రజల నుంచి వ్యతిరేకతే కాదు...సొంత పార్టీలో కూడా శ్రీదేవిపై నెగిటివ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేగా శ్రీదేవికి అసలు ప్లస్ మార్కులు పడటం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీదేవి గెలుపు ఆ దేవుడు చేతుల్లోనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: