
కానీ అద్దె ఇళ్ళలో ఉంటూ, పాల బాకీ అని, కిరాణా బాకీ అని, చాకలి ఇస్త్రీ బాకీలనీ, కేబుల్ బిల్లులనీ, ఫోన్ బిల్లులనీ, స్కూలు ఫీజులు అని ఇలా చెప్పాలంటే రకరకాల బిల్లులు అన్నీ కూడా తీర్చాల్సింది ఫస్ట్ తారీకు నుండే. అంతేకాకుండా ఫస్ట్ తారీకున వచ్చే జీతంపై ఎన్నో ఆశలు పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆరోజు వచ్చే అమౌంట్ పై ఒక నెలరోజుల ముందు నుండే ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఇక్కడకు వెళ్లాలి, అక్కడ ఖర్చు పెట్టాలి, ఇలా ఎంజాయ్ చేయాలి అని. ఈ ఒకటో తారీఖున మధ్యతరగతి వాళ్ళు పడే బాధను అంతా కూడా గతంలో ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రధారిగా అమ్మో ఒకటో తారీకు అనే సినిమా కూడా వచ్చింది. అందులో ఒకటో తారీఖున వస్తుందంటే మధ్య తరగతి వాడు పడే సంతోషాన్ని, బాధను అర్థం పట్టేటట్టు చిత్రీకరించారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అగ్రరాజ్యాలకు కూడా ఫస్ట్ తారీకు ప్రభావం పడుతుందని తెలుస్తుంది.
అమెరికాకి 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది జూన్ ఒకటో తారీకుకి. అయితే ఈ గడువు జనవరిలోనే అయిపోయిందని తెలుస్తుంది. అప్పటినుండి ఈ నాలుగు నెలలు కూడా అమెరికా అలా నెట్టుకొస్తుందట. అయితే ఇప్పుడు ఆ అప్పును పెంచమని అడిగితే ఒక ట్రిలియన్ డాలర్లు మాత్రమే పెంచడానికి కుదురుతుందని చెప్పారట.