‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ కు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈసినిమాలో ప్రభాస్ ఒకే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. గత సంవత్సరం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో అల్లుఅర్జున్ బ్రాహ్మణుడుగా పోలీసులతో సహకరించే పాత్రలో కనిపించినట్లుగానే ‘సాహో’ లో కూడ ప్రభాస్ ఒక ఇంటర్ నేషనల్ క్రిమినల్ గా పోలీసు ఇన్ ఫార్మర్ గా రెండు షేడ్స్ లో ఉండే పాత్రలను ఆసినిమా చూసేవారికి ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనిపించే విధంగా సస్పెన్స్ కొనసాగిస్తూ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

PRABHAS IN SAAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈసినిమాకు సంబంధించి షూటింగ్ విషయంలో రకరకాల కారణాలతో ఈమూవీ షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఇప్పటికే స్టార్ట్ కావలసిన దుబాయ్ షెడ్యూల్ అక్కడి ప్రభుత్వాల అనుమతి రాకపోవడంతో ఈ నెలాఖరుకి కానీ లేదా వచ్చేనెల మొదటి వారంలో కానీ దుబాయ్ షెడ్యూల్ ఉంటుంది అని అంటున్నారు.

 PRABHAS IN SAAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ షెడ్యూల్ తరువాత రొమేనియా షెడ్యూల్ ఉంటుందట. దుబాయ్ షెడ్యూల్ దాదాపు నెలరోజులు కొనసాగితే ఆ తరువాత రొమేనియా షెడ్యూల్ మరో నెల రోజులు పైగా ఉంటుందని అంటున్నారు. దీనితో ఈ రెండు దేశాలలోని షూటింగ్ కు మూడు నెలల సమయం పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు.  

RABHASALONG WITH DIRECTOR SUJITH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి సముద్రగర్భంతో పాటు ఏరియల్ షూట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లిన ప్రభాస్‌ అక్కడ స్కూబా డైవింగ్‌ కు సంబంధించి ట్రైనింగ్ తీసుకొన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇంతే కాకుండా దర్శకుడు సుజిత్ ప్రభాస్ లు ఈసినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని క్వాలిటీలో తేడా వస్తే మళ్ళీ రీషూట్ చేయాలి అన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తుంటే కనీసం 2019 సంక్రాంతికి అయినా ఈసినిమా విడుదల అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: