సాహో సినిమా టీజర్ నిన్న యూట్యూబ్ లో విడుదలైన తరువాత సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఇక ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవుథులు లేవనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఇది అసలు మన ఇండియన్ సినేమానా లేక హాలీవుడ్ సినేమానా అనేలా ఉందని పలువురు ప్రేక్షకులు సహా సినిమా ప్రముఖులు సైతంపై టీజర్ పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. 

ఇక ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఫోటోగ్రఫీ అదరగొట్టగా, గిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్రాణంగా నిలిచింది అనే చెప్పాలి. ఇక టీజర్ చూసిన చాలామందిలో ప్రస్తుతం ఒక ఆలోచన కలుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా సంగీత దర్శకులుగా శంకర్, ఎహసాన్, లాక్ సాహో నుండి తప్పుకోవడంతో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మరెవరినైనా తీసుకున్నారా లేదా అనేదానిపై సందిగ్ధత పై ఆ సినిమా టీమ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదు. 

అయితే టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టిన గిబ్రాన్ నే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని ప్రలువురు ప్రభాస్ ఫ్యాన్స్ సహా నెటిజన్లు కొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గతంలో సుజిత్ తొలి సినిమాగా వచ్చిన రన్ రాజా రన్ పనిచేసింది గిబ్రానే కాబట్టి ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా అతడినే తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి సాహో టీమ్ ఎవరిని తమ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుందో తెలిసి ఈ సందిగ్ధం తొలగాలంటే మాత్రం వారి నుండి అధికారిక ప్రకటన రావలసిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: