ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు తమన్.. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలకు మీజిక్ ను అందిస్తూ వస్తున్నా తమన్ ఈ మధ్యకాలం లో బిజీగా ఉన్నాడు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయన్న విషయం తెలిసిందే.. ఈ సంగీతాన్ని వినిపించడానికి ఎన్నో రకాలైన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఘటం, హార్మోనియం, డప్పు, డోలక్ ఇవే మన సంగీత పరికరాలు. కానీ, కాలంతో పాటు సంగీతంలో రకరకాల మార్పులు వచ్చాయి. కొత్త కొత్త సంగీత పరికరాలు పుట్టుకొచ్చాయి.

 


ప్రస్తుతం సినీ రంగాల్లో సంగీతం కోసం చాలా రకాల పరికరాలు అందుబాటులోకి  వచ్చాయి. సంగీత దర్శకులు ఎన్నో కొత్తరకం ఇన్‌స్ట్రుమెంట్లు వాడుతున్నారు. చాలా వరకు అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలే. ఎలక్ట్రానిక్ కీబోర్డ్, ఎలక్ట్రిక్ గిటార్, రిథమ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్లూట్.. ఇలా చాలా రకాలున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ లాంటి సంగీత దర్శకులైతే ప్రపంచ వ్యాప్తంగా జల్లెడ పట్టి మరీ కొత్తరకం పరికరాలు తీసుకొస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఒక కొత్త మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. దాని పేరు పెర్ల్ మాలెట్‌స్టేషన్. దీనిపై ఎలాంటి సౌండ్‌ అయినా వచ్చేస్తుంది. కీబోర్డ్, డ్రమ్స్ ఇలా రకరకాల సౌండ్స్ దీనిపై వాయించొచ్చు.

 


అయితే, సంగీతంలో మరింత ముందుకు రావాలని.. ఒక ఇన్స్ట్రుమెంట్స్ కొనిచ్చాడు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకో బిగ్ సర్‌ప్రైజ్. ఈయన నిజంగానే ప్రతిరోజూ పండగే చేశారు. హృదయాన్ని హత్తుకునే చాలా గొప్ప వ్యక్తి. మేం విజయం సాధించాలని చాలా గట్టిగా ప్రార్థిస్తా’’ అని తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌కు ఇప్పుడుప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఎ.ఆర్.రెహమాన్ తన కుమారుడు ఎ.ఆర్.అమీన్‌తో ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ను ప్లే చేయించారు. ఇద్దరూ కలిసి మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన వీడియో ఒకటి ఆయన యూట్యూబ్‌లో పెట్టారు. నిజంగా ఇదో గొప్ప మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్. చాలా శబ్దాలు దీనిలో సులభంగా పలుకుతాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా ఈ పరికరం విలువ దాదాపుగా 82 వేలట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: