బాలీవుడ్ లో నటవారసుల హంగామా, స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. నిరంతరం ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ గత కొంతకాలంగా వరుస ఫోటోషూట్లతో బాలీవుడ్ జానలతో పాటు సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న నెటిజన్ల ను హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు తనకు ఇష్టమైన పోయెట్రీని చెబుతూనే... కాన్సెప్ట్ ఫోటోషూట్లతో తనని తాను బాహ్య ప్రపంచానికి ఆవిష్కరించుకుంటోంది. బాలీవుడ్ లో టాప్ మోడల్ గానో లేక టాప్ హీరోయిన్ గానో ఫేమస్ అవ్వాలని తాపత్రయపడుతుంది.

 

ఇక ఇరా ఖాన్ బాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉంది. ముందుగా ఓ నాటకానికి దర్శకత్వం వహిస్తోంది. యూరిపీడెస్ మెడియా అనే స్టేజీ డ్రామాకు ఇరా దర్శకత్వం వహిస్తోంది. ఓవైపు ఈ డ్రామా వల్ల మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ నాటకం ముంబైలో పాపులరైంది. దీనికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. యువరాజ్ సింగ్ సతీమణి హజెల్ కీచ్ ఈ నాటకంలో లీడ్ పాత్రలో చేస్తోంది. ఇరా సోదరుడు జునైద్ ఖాన్ కూడా ఈ స్టేజీ డ్రామాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దీనిని నౌతంకిసా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక దీనికి వెటరన్ స్టార్ సారిక (కమల్ హాసన్ మాజీ భార్య) ఈ సంస్థకు అధినేతగా కొనసాగుతోంది. ఇంత మంది గ్రేట్ పర్సన్స్ తో ఇరా వర్క్ చేయడం మామూలు విషయం కాదు.

 

ఈ నాటకానికి సంబంధించిన అప్ డేట్స్ ని ఇరా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెబుతూనే ఉంది. పనిలో పనిగా ఖాళీ సమయాల్ని సద్వినియోగం చేస్తూ... హాట్ హాట్ ఫోటోషూట్లలోనూ పాల్గొంది. తాజాగా ఇరా ఖాన్ స్పెషల్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోల్లో ఇరా థై స్లిట్ లుక్ తో పాటు... బ్యాక్ లెస్ గౌనుతోనూ కనిపించింది. సుందరమైన కొండకోనల నేపథ్యంలో స్టార్ డాటర్ ఫోటోషూట్ కోసం అనేక భంగిమలతో ఫోజులిచ్చింది. ఇరా ఈ ఫోటోలను షేర్ చేసి వాట్ ఎ వ్యూ అంటూ తనలోని ప్రకృతి ప్రేమికురాలిని బయటి ప్రపంచానికి చూపించేసింది. ముందు నాటకాల దర్శకురాలిగా సత్తా చాటి సినిమాలకు దర్శకత్వం వహించాలన్నది ఇరా ప్లాన్. మరి ఈ స్టార్ కిడ్ ఎంతవరకూ సక్సెసవుతుంది అన్నది వేచి చూడాలి. అంతేకాదు బాలీవుడ్ లో హీరోయిన్ గాను రాణించాలని ట్రై చేస్తొందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: