తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి సమంత. స్టార్ హీరోలందరితోనూ నటించిన సమంత ప్రస్తుతం తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలే చేస్తుంది. అందుకే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. నాగచైతన్యతో పెళ్ళి తర్వాత తాను ఎంచుకున్న చిత్రాలన్నీ దాదాపుగా నటనా ప్రాధాన్యం ఉన్నవే. అయితే తాను చేసిన ఈ పాత్రలకి మంచి పేరొచ్చింది కూడా.

 

 

 
సమంత ప్రస్తుతం సినిమాలు తగ్గిస్తానంటోందిట. అందుకే తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోలేదని సమాచారం. కానీ తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ప్రేమ కథా చిత్రంతో పాటు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ చిత్రాన్ని కూడా ఒప్పుకుంది. అయితే సమంతకి హార్రర్ చిత్రాలేవీ అచ్చి రాలేదు. మంచి మంచి ప్రేమ కథాచిత్రాల్లో చూసిన సమంతని ఒక దయ్యంగా చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడట్లేదు.

 

 

ఆ విషయం రాజు గారి గది 2 తో క్లియర్ గా అర్థం అయింది. ఇదే కాదు హార్రర్ నేపథ్యం ఉన్న యూటర్న్ సినిమా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండూ చిత్రాల ఫ్లాపుల తర్వాత సమంతకి హార్రర్ జోనర్ కరెక్ట్ కాదని భావించారు. కానీ సడెన్ గా మళ్ళీ తనకి నప్పని జోనర్ లో సినిమా ఒప్పుకోవడంతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. తనకి సెట్ అవ్వని జోనర్ లో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న అనుభవం ఉన్న సమంత మళ్ళీ ఆ జోనర్ లోనే ఎందుకు సినిమా చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదు.

 

 


అయితే సమంత ఒప్పుకోవడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. హార్రర్ జోనర్లోనే అయినా కథ చాలా డిఫరెంట్ గా ఉన్నందునే ఆమె ఒప్పుకుందని చెబుతున్నారు. మరి ఆ విషయం ఎంత వరకు కరెక్ట్ అనేది సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: