సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయినా.. బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఖచ్చితంగా హిట్ అవ్వడమే కాకుండా రికార్డులు బద్దలు కొడతాయి అనుకున్న సినిమాలు కూడా వెండితెరపై బోల్తా పడుతుంటాయి. అలాంటి సినిమాలు బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇదివరకే ఇది రుజువైన విషయం. అయితే అలాంటి సినిమాల్లో ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా ఒకటి.
టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా నటించాడు. నేను శైలజ, హైపర్ చిత్రాల తర్వాత వచ్చిన చిత్రమిది. మరో హిట్‌ను కెరీర్లో జమ చేసుకొనేందుకు రామ్ మళ్లీ నైను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావన్య తిపాటి నటించారు. అలాగే ఈ చిత్రాన్ని స్రవంతి సినిమాటిక్స్, పిఆర్ సినిమాస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య నిర్మించారు. ఒక కారణమ్మీద దూరమైన ఇద్దరు స్నేహితులు తిరిగి ఎలా ఒక్కటయ్యారనేది ఈ చిత్రం ఇతివృత్తం.
అయితే స్నేహితులు విడిపోవడానికి బలమైన కారణం కానీ, ఇద్దరూ తిరిగి ఒకటయ్యేందుకు తగిన సందర్భం కానీ సృష్టించలేకపోవడం ఈ చిత్రానికి జరిగిన అతి పెద్ద లోపం. దీంతో ఈ సినిమా వెండితెరపై ఆశించినంతగా విజయం సాధించలేదు. కానీ, బుల్లితెర మీద మాత్రం ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం బెల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక అటు యూట్యూబ్‌లోనూ ఈ సినిమా అత్యధిక వ్యూస్ సంపాధించుకుంది. అలాగే థియేటర్లో ఫ్లాప్ అయిన రామ్ సినిమా బుల్లితెరపై మాత్రం హిట్‌గా నిలిచింది.