కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. శాండిల్ ఉడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజిఎఫ్ మొదటి భాగం కలెక్షన్స్ అని దాటి మరి రికార్డు సృష్టించింది కాంతారా చిత్రం. ఈ సినిమాకి ఫ్రీక్వల్ గా కాంతారా చాప్టర్ 1 సినిమా నిన్నటి రోజున భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటించిగా , మొదటి భాగంలో నటించిన కొంతమంది నటీనటులు ఇందులో నటించారు.దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ షోలతో భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఈ సినిమా ప్రీమియర్స్ షోలకి హిట్ టాక్ వచ్చింది.



ముఖ్యంగా సినిమా చూసినవారు టెక్నికల్ గా అద్భుతంగా బాగుందని, అటవీ నేపథ్యాన్ని తెరకెక్కించే సన్నివేశాలు కూడా అద్భుతంగా చూపించారని రిషబ్ శెట్టి ని ప్రశంసించారు. హీరో నటన కూడా అద్భుతంగా ఉందని ఈ సినిమాకి కచ్చితంగా అవార్డులు గెల్చుకోవడం ఖాయమని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు రిషబ్ శెట్టి జీవించిపోయి నటించారని ఆయన పడ్డ కష్టం సినిమా ఫలితంలో కనిపిస్తోందని తెలుపుతున్నారు. సినిమా చూసిన వారందరూ కూడా శభాష్ రిషబ్ శెట్టి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో అభిమానులు ఓటీటి విషయం పై  ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓటిటి విషయంపై ఒక న్యూస్ వినిపిస్తోంది.


అదేమిటంటే ఈ సినిమా ఓటిటి హక్కుల అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని,శాటిలైట్ రైట్స్ ను ZEE నెట్వర్క్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటిలోకి తీసుకువచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. నిన్నటి రోజున విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఏ విధంగా రాబడతాయో చూడాలి మరి. ఓటిటికి సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: