మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాలో తన నటనను ప్రేక్షకులకు చూపిస్తూ మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో చాలా సినిమాలు మంచి హిట్ ను అందుకోవడమే కాదు .. భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి..కొన్ని సినిమాలు మాత్రం పర్వాలేదనే టాక్ ను అందుకున్నాయి.అయితే ఆ సినిమాలు పెద్ద స్క్రీన్ లో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన.. బుల్లి తెరపై ప్రసారమయ్యి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాయి..ఇకపోతే  ఆయన కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల్లో ఒకటి వినయ విధేయ రామ..
 

 


సినిమా బుల్లి తెరపై వచ్చినప్పుడు అందరిని ఆకట్టుకుంది.. కాని ఈ సినిమాను థియేటర్ లో మాత్రం మొదటి రోజే నెగిటివ్ టాక్ ను అందుకుంది. అయితే ,బుల్లి తెర మీద వస్తే మాత్రం కచ్చితంగా జనాలు ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా చుస్తారాన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అగ్ర నటులు నటించారు.కథను కొంచెం సరిచేసి ఉంటే సినిమా వెండి తెరపై కూడా సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ నటన అద్భుతం.. కుటుంబాన్ని ప్రేమిస్తూ, ఎవరికైనా నష్టం కలిగితే తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతాడు.

 

 


సినిమా కథలో ఆ పాత్రే చాలా కీలకం. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన చాలా బాగుంది.కానీ ఈ సినిమా కథ విషయంలో కొన్ని  జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేది కాదు అని మెగా అభిమానులు ఇప్పటికీ అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు.రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: