ప్రభాస్–మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన "రాజా సాబ్"  సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందా..?  అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ స్పెషల్ మూమెంట్ కోసం ఇక కౌంట్‌డౌన్ మొదలైంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ముందుగానే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా, ప్రభాస్‌ను ఎలాంటి లుక్‌లో చూడాలి అనుకున్నారో జనాలు అలాంటి లుక్‌ల్లోనే మారుతి చూపించాడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఆయన డైలాగ్స్, రొమాంటిక్ యాంగిల్, యాక్షన్ సీన్స్, భయపడే సీన్స్, భయపెట్టే సీన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రభాస్ ని మన బుజ్జిగాడు సినిమాలో మాత్రమే చూశాం. ఇన్నాళ్లకి ఆ కోరికను నెరవేర్చారు మారుతి.  అందులోనూ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఎక్కువగా హైలైట్ చేస్తున్న విషయం – మోసలి ఫైట్ సీన్.

ఇంటర్వెల్ సమయంలో ఒక మొసలితో ఫైట్ సీన్ ఉంటుందని, అది చాలా ఫన్నీగా, ఆకర్షణీయంగా, పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారని చెబుతున్నారు . మారుతి తన స్టైల్‌కు తగ్గట్టుగా ఫైట్ సీన్స్‌ని తెరకెక్కించాడు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లో షాట్స్ కట్ చేసిన విధానం కూడా హైలైట్ అవుతోంది. దీనితో సోషల్ మీడియాలో ప్రభాస్–మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రాజా సాబ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఒక మొసలితో ఫైట్ సీన్ – అది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోతో.. కామెడీ హారర్ టచ్‌తో రావడం నిజంగా గ్రేట్ అనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. చూడాలి మరి.. మారుతి దర్శకత్వం, ప్రభాస్ యాంగిల్స్ ఎలాంటి రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తాయో..?? ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ రాజా సాబ్ గురించే హాట్ టాపిక్‌గా చర్చలు జరుగుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: