
పైరసీ సినిమాల వల్ల ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్లకు కూడా అలవాటు పడుతున్నారని బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కూడా పైరసీ చేయించడానికి డబ్బులు ఇచ్చి మరి ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు ప్రాంతానికి చెందిన సీరిల్ అని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నాలుగు పైరసీ సైట్లను నడుపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ చదివి డబ్బులను సులభంగా సంపాదించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ఏజెంట్లను నియమించుకొని మరి అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నారట. హైదరాబాదులో అత్తాపూర్ ప్రాంతంలో ఉన్న మాల్ థియేటర్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక హై ఎండ్ కెమెరా మొబైల్ తో రికార్డు చేస్తూ అప్లోడ్ చేసేవారని,అలాగే 22 ఏళ్ల అశ్విన్ కుమార్ ని మరొక నిందితుడని డిజిటల్ మీడియా సర్వర్లను కూడా హ్యాక్ చేసి సినిమాలను అప్లోడ్ చేశారని.. సుమారుగా 1000 కి పైగా సినిమాలను నేరుగా సర్వర్లను హ్యాక్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నారట. సినిమాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ వెబ్సైట్లు ,ఎన్నికల కమిషనర్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తి అని అధికారులు తెలుపుతున్నారు.
అయితే వీరంతా కూడా క్రిస్టో కరెన్సీ, బిట్ కాయిన్ల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి సినిమాకి 300 నుంచి 400 డాలర్లు తీసుకుంటారట. ఈ డబ్బులను ఇండియన్ కరెన్సీ లోకి మార్చడానికి అశ్విన్ అనే వ్యక్తి సహాయం చేసేవారని.. అలాగే బెట్టింగ్ యాప్లకు సంబంధించి నిర్వహకులకు ప్రతినెల రూ.9 లక్షలు జీతం ఇచ్చేవారట. అశ్విన్ కుమార్ తన ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు రావడం గమనించిన అశ్విన్ తన మొబైల్ డేటాను డిలీట్ చేశారు. కానీ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వాటిని డిలీట్ చేయలేక చిక్కిపోయారని తెలిపారు అధికారులు.