
ఇలాంటి ప్రభాస్ ఒక కామెడీ సినిమాలో నటిస్తే, అది నిజంగా ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌నే ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాపిక్ హాట్‌గా ట్రెండ్ అవుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాజా సాబ్. ఇది పూర్తిగా కామెడీ–హారర్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్నీ మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఫుల్ కామెడీ–హారర్‌తో నిండిపోగా, మారుతి కట్ చేసిన ఎలివేషన్స్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ముందుగానే చెప్పేశాయి.
రాజా సాబ్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. "ప్రభాస్ మరోసారి కామెడీ యాంగిల్‌లో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు" అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ప్రభాస్ యాక్టింగ్‌పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ పూర్తిగా వేరుగా ఉందని, ముఖ్యంగా సలార్ లో ఎంత సైలెంట్‌గా కనిపించాడో, ఇందులో అంత నాటీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించాడని అంటున్నారు. అదే కారణంగా కొన్నిసీన్స్‌లో "ప్రభాస్ యాక్టింగ్ చేయలేదు, ఓవర్ యాక్టింగ్ చేశాడు" అనిపించిందని రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌తో రొమాన్స్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు.
ప్రభాస్ అంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి తగ్గ సినిమాలు వస్తేనే బాగుంటుందని కొందరు జనాలు అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం "ఈ కామెడీ యాంగిల్ కూడా కొత్తగా ఉంది, ట్రైలర్‌లో ఇలా అనిపించినా సినిమా మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది" అని నమ్మకంగా చెబుతున్నారు. మొత్తం మీద రాజా సాబ్ ట్రైలర్‌పై పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ రెండూ వినిపిస్తున్నాయి. కానీ మారుతి గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన హీరో ప్రభాస్‌ను మారుతి ఎలా వాడుకున్నాడో, తెరపై ఎలా చూపించబోతున్నాడో తెలుసుకోవాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది..!!