తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు నటించి మెప్పించిన భామలు ఇప్పుడు
సినిమా అవకాశాలు లేక సినిమాల విమర్శలకు , వివాదాలకు కేరాఫ్ గా మారారు. చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటున్నారు. విషయానికొస్తే..
మాధవి లత ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకటో రెండో సినిమాలలో తలుక్కున్న ఈ అమ్మడు ఇప్పుడు అన్నిట్లో తల పెడుతుంది. అందరి చేత విమర్శలు అందుకుంటుంది. సినిమాల మాట పక్కన పెడితే
బీజేపీ పార్టీలో చేరింది.ప్రస్తుతం
పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుంది.
అయితే
టాలీవుడ్ లో డ్రగ్ దందా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా
డ్రగ్స్ భూతం వణికిస్తోంది. ఇటీవల
శాండిల్ వుడ్ లో
సంజన, రాగిణి లతో పాటు
బాలీవుడ్ లో రియా
చక్రవర్తి ఇలా చాలా మంది
డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలతో జైలుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో తాజాగా
హీరోయిన్,
బీజేపీ నేత
మాధవీలత టాలీవుడ్ పార్టీల్లో
డ్రగ్స్ వాడకంపై సంచలన కామెంట్స్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
బాలీవుడ్ తో పోలిస్తే
టాలీవుడ్ లో పార్టీల లో
డ్రగ్స్ తీసుకోవడం సర్వసాధారణం అని ఆమె అన్నారు.ఈ విషయంలో
తెలంగాణ ఎన్‌సీబీ అధికారులు దృష్టిసారిస్తే మంచిదని తెలిపింది. అదేవిధంగా
డ్రగ్స్ వెనుక పెద్ద మాఫియా ఉందని, పెద్ద హీరోల పేర్లు చెబితే తమ ప్రాణాలకే ప్రమాదమని అధికారులు భావిస్తున్నట్లు
మాధవి అన్నారు. అందువల్లే కేవలం అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న బడా నటుల పేర్లను మాత్రమే బయటకు తీస్తున్నారని ఆమె అంది. అబ్బాయిల పేర్లు బయట పెట్టాలంటే భయం అందుకే అధికారులు బయటకు చెప్పడం లేదంటూ మండిపడింది. న్యాయం అందరికీ న్యాయమే కానీ ఇలా కొందరికి కొమ్ము కాయడం భాదాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మాటలు ఎంతవరకు తీసుకెళతాయో చూడాలి..