
లో బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మారుతి ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా చేయగలరా? అనే అనుమానం ఫ్యాన్స్ కే కాదు ఇండస్ట్రీలో కూడా వినిపించేది. ఈ విషయం వల్ల ఒకానొక దశలో ఈ ప్రాజెక్టును వదిలేద్దామనే ఉద్దేశం కూడా డైరెక్టర్ మారుతికి ఉండేదట. కానీ ప్రభాస్ ఇచ్చిన సపోర్టు వల్లే డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తీశారు. బుజ్జిగాడు సినిమాలో చేసిన కామెడీ తీరు ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. తాజాగా విడుదలైన ట్రైలర్లో అదే కామెడీ స్టైల్ ని రాజా సాబ్ సినిమాలో తీసుకువచ్చి సెట్ చేశారు మారుతి. ఇదే సినిమాని మరింత ఎక్స్పెక్టేషన్ పెంచేలా చేసిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్ లో అదిరిపోయారని.. ప్రభాస్ యాక్టింగ్, విఎఫ్ఎక్స్ అంతా కూడా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా బాలీవుడ్ ,హాలీవుడ్ స్థాయిలో తీసినట్టుగా ఫ్లేవర్ కనిపిస్తూ ఉంది ట్రైలర్లో..కానీ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదనే విధంగా అభిమానుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభిమానులకు కిక్కెక్కించేలా బిజిఎం ఇచ్చినట్లు కనిపించలేదనే విధంగా తెలియజేస్తున్నారు. మరి పూర్తి సినిమా విడుదలైన తర్వాత ఏ విధంగా రాజా సాబ్ సినిమా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో చూడాలి మరి. కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాలలో నటించనున్నారు ప్రభాస్.