సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన రమ్యకృష్ణ 50 ఏళ్ళు వచ్చినా కూడా తన సత్తా చాటుతుంది. ఇప్పటికి నేటితరం హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె సత్తా చాటుతుంది. ఇప్పటికి రమ్యకృష్ణకు క్రేజీ ఛాన్సులు వస్తున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో కూడా రమ్యకృష్ణ అందరికి షాక్ ఇస్తుంది.

ఇంతకీ ప్రస్తుతం రమ్యకృష్ణ ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందో తెలుసా.. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా రమ్యకృష్ణ రోజుకి 10 లక్షల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అంటే రమ్యకృష్ణ ఓ పదిరోజులు షూటింగ్ చేస్తే కోటి రూపాయలు వసూళు చేసినట్టే. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర రమ్యకృష్ణ కెరియర్ కు బాగా హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు.

తనదైన పాత్రలో అలరిస్తూ వస్తున్న రమ్యకృష్ణ ఎప్పటికి హాట్ ఫేవరేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాల దాకా ఉన్నాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫైటర్ తో పాటుగా సాయి ధరం తేజ్ దేవా కట్టా సినిమాలో కూడా రమ్యకృష్ణ స్పెషల్ రోల్స్ చేస్తుంది. ఈ సినిమాల్లో నటిస్తున్నందుకు శివగామి భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

తెలుగులోనే కాదు తమిళంలో కూడా జయలలిత బయోపిక్ గా వచ్చిన క్వీన్ లో నటించి మెప్పించింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికి సూపర్ ఫాం లో ఉన్న రమ్యకృష్ణ 50 ఏళ్లకు కోటి దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: