ఇటివల బాలీవుడ్ ని కుదిపేసిన అంశం ‘నెపోటిజమ్’. సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని.. కొత్తగా వచ్చేవారికి అవకాశాలు దక్కడం లేదనే ఆరోపణలతో బాలీవుడ్ హీటెక్కిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం రేపింది. ఇప్పుడు ‘నెపోటిజమ్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. కొత్త నటీనటులు.. కొత్త సాంకేతికవర్గంతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటివల పూర్తైంది. లిరికల్ వీడియో ను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నెపోటిజమ్ పై స్పందించారు.


నెపొటిజం ఉందనేది నిజమే. పలువురు హీరోలు, డైరెక్టర్ల కొడుకులు గతంలో హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు తమ టాలెంట్ తో  సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు వున్నారు. టాలెంట్ ను ప్రదర్శించుకోవడానికి కావల్సింది పట్టుదల. చేసే వర్క్ మీద సిన్సియర్ గా ఉండాలి’ అన్నారు. టాలెంట్ వుండి సిన్సియర్ గా పనిచేస్తే టాప్ పొజిషన్ లోకి వస్తారు. ఇందుకు స్టార్ ఫ్యామిలీ నుంచే రానవసరం లేదు. మనల్ని మనం నమ్ముకోవాలి. మరొకరిని ఇమిటేట్ చేస్తామంటే ఇక్కడ ఎక్కువ కాలం వుండరు. అదే ఈ సినిమా చెప్తోంది. యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.


ట్రైలర్ చూస్తే మంచి ప్రయత్నం చేశారనిపించిందని తమ్మారెడ్డి అన్నారు. పాపిన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై అనిల్ కుమార్, కే.శ్రీనివాసరావు ఈ సినిమా నిర్మించారు. విపుల్ దర్శకుడు. వెంకీ, వాసిం, వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. పుట్టగానే ఎవ్వరూ స్టార్ కారు. స్టార్ కావడానికి ఎవరైనా కఠోర శ్రమ చెయ్యాల్సిందే అనే పాయింట్ తో ఈ సినిమా తీశామన్నారు దర్శకుడు విపుల్. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: