మెగాస్టార్ చిరంజీవి మలయాళ లూసిఫార్ సినిమాను రిమేక్ చేయనున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో కీలకమైన మార్పులను చేసేశారు. మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ అయిన తరువాత, ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి కూడా పూర్తి స్క్రిప్ట్‌ ను వినిపించారు.కానీ, అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. కట్ చేస్తే.. దర్శకుడు మోహన్ రాజాకి మళ్ళీ రెండు నెలలు టైం దొరికింది. అందుకే మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు.కూర్చుంటే కూర్చున్నాడు. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీన్స్ ను కూడా మార్చుకుంటూ పోతున్నాడట. 

మెగాస్టార్ ఇమేజ్ కు అనుగుణంగా మోహన్ రాజా కథలో మార్పులు చేస్తే పర్వాలేదు, కానీ మార్పులు పేరుతో కథనే మార్చుకుంటూ పోతేనే అసలుకే మోసం వస్తోంది. అసలైతే ఏప్రిల్ నుండి లూసిఫెర్ రీమేక్ షూటింగ్ మొదలవ్వాలి కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం మోహన్ రాజా స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయడానికి కారణం అయింది. మోహన్ రాజా మంచి దర్శకుడే. పైగా అతను సక్సెస్ లో ఉన్నాడు.ఇక తమిళ ఇండస్ట్రీలో మోహన్ రాజాకు మంచి పేరు ఉంది. అందుకే చిరు పిలిచి మరీ అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తన మార్పుల ప్రవాహంలో లూసిఫెర్ ను ఎలా మారుస్తాడో అనే భయం పట్టుకుంది అందరికి.

ఇక 'లూసిఫర్'లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుంది. ఈ పాత్రకు సంబంధించిన ట్రాక్ ను కూడా మోహన్ రాజా చాల మార్చారట. అలాగే సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ ను కూడా పూర్తిగా మార్చారట.అయినా, మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా మోహన్ రాజా షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి గానీ, ఇలా హిట్ సినిమా స్క్రిప్ట్ లో ప్రతి పార్ట్ ను మార్చుకుంటూ పోతే, ఇక ఆ హిట్ సినిమా చేయడం ఎందుకు ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ భారీ మూవీని రీమేక్ చేసే అవకాశం ఇస్తే.. అతను ఆ అవకాశాన్ని చెడగొట్టుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: