కొన్ని సార్లు సోషల్ మీడియాలో సడన్ గా ఏ సినిమా ట్రెండ్ అవుతుందో ఎవరికి తెలీదు. ఇప్పుడు కరోన ప్రభావం ఎక్కువగా ఉండటం వలన అందరూ ఇంట్లోనే ఉండి చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూస్తూ గడిపేస్తున్నారు. అలా  అల్లరి నరేష్ ఒకప్పుడు తీసిన కెవ్వు కేక సినిమా ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.అది ఎలాగో తెలుసుకోవాలి అంటే  యూ ట్యూబ్ లో కెవ్వు కేక సినిమాను 34:18 నిడివి దగ్గర 0.25x స్పీడ్ తో వింటే మీకే అర్థం అవుతుంది. బాబోయ్ ఆ బూతులు గోల ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

సీన్ ను ఫాస్ట్ గా ఫార్వార్డ్ చేయడంతో అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు. ఇక సెన్సార్ బోర్డును చాలా తెలివిగా మోసం చేశారని చెప్పవచ్చు. ఇక 8 ఏళ్ళ తరువాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చలపతి రావుకు సంబంధించిన బూతులు సీన్ వైరల్ అవ్వడంతో ఆ విషయంపై దర్శకుడు దేవి ప్రసాద్ స్పందించారు. నాకు ఆ బుతులకి ఎలాంటి సంబంధం లేదు అని సినిమా డబ్బింగ్ జరిగే సమయంలో నేను లేను అని అసలు ఈ దరిద్రం ఎలా జరిగిందో అస్సలు అర్థం కావట్లేదు అని ఆయన అన్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సోషల్ మీడియాలో పబ్లిసిటీ వలన వ్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి.

అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమాలని వెలికి తీసి మరి ట్రోల్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయం ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా అంత పాకుతుంది. ఒకప్పుడు రారండోయ్ వేడుకాచుద్దాం సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చలపతిరావు గారు చేసిన కామెంట్స్ ఇంకా ఎవరు మర్చిపోకముందే ఇలా ఇంకొకసారి సోషల్ మీడియా లో ఆయన హల్ చల్ చేయడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: