అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చారు. వీరంతా ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఎంతోమంది అభిమానులను సంపాదించినా , ఈ హీరోలు తాము నటించిన మొదటి సినిమా ఏదో తెలుసుకోవడం కోసం , వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మన హీరోలు ఏ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారో తెలుసుకుందాం.

1).నందమూరి తారక రామారావు:
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, శ్రీ కృష్ణ వేణి కలిసి నటించిన చిత్రం మన దేశం.


2). అక్కినేని నాగేశ్వరరావు:
డైరెక్టర్ పి.పుల్లయ్య, నాగేశ్వరరావు, హేమలత కలిసి నటించిన చిత్రం ధర్మపత్ని.


3). సూపర్ స్టార్ కృష్ణ:
డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, సుకన్య,
కలిసి నటించిన చిత్రం తేనె మనసులు.


4). చిరంజీవి:
డైరెక్టర్ రాజ్ కుమార్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సావిత్రి, కవితలతో కలిసి నటించిన సినిమా పునాది రాళ్లు.

5). బాలకృష్ణ:
డైరెక్టర్ భారతీ వాసు దర్శకత్వంలో బాలకృష్ణతో తీసిన సినిమా సాహసమే జీవితం.

6). వెంకటేష్:
డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, కుష్బూ కలిసి నటించిన చిత్రం కలియుగ పాండవులు.

7). నాగార్జున:
డైరెక్టర్ వి.మధుసూదనరావు, నాగార్జున మన కలిసి నటించిన చిత్రం విక్రమ్.

8). మహేష్ బాబు:
డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు ప్రీతిజింటా కలిసి నటించిన చిత్రం రాజకుమారుడు.

9). పవన్ కళ్యాణ్:
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, సుప్రీత  హీరోయిన్ గా  కలిసి నటించిన చిత్రం"అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి"


అలాగే ప్రభాస్ ఈశ్వర్ సినిమా, రామ్ చరణ్ చిరుత సినిమా, అల్లు అర్జున్ గంగోత్రి మూవీ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అంతేకాదు ఇక మరెంతో మంది హీరోలు మొదటి సినిమాతో అడుగు పెట్టి హ్యాట్రిక్ విజయాలను కూడా అందుకున్న వారు కూడా ఉన్నారు. వీరి నటనతో ప్రేక్షకులను ఎంతగానే అలరించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: