
ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కాగా మెగా స్టార్ బర్త్డే సందర్భంగా చిరు చేయనున్న తదుపరి ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్ ఇచ్చేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ మూవీ మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి చెందిన తాజా అప్డేట్ ను చిరు బర్త్ డే సందర్భంగా ప్రేక్షకులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట లూసిఫర్ మూవీ టీం. మరి అది సర్ప్రైజ్ పోస్టరా, డైరెక్ట్ గా టీజరా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా మెగా స్టార్ చిరుకి బర్త్ డేకి ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్.
మెగా ఆల్బమ్ ను గిఫ్ట్ గా ఇవ్వబోతునట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరు పుట్టినరోజు గురించి సందడి మొదలైపోయింది. కాగా త్వరలో విడుదల కానున్న ఆచార్య సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి చిరు పుట్టిన రోజు వేడుకలు ఏ రేంజ్ లో జరుగుతాయో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.