మెగాస్టార్ చిరంజీవి నటుడిగా తనను తాను ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు.  సహజంగా ఆయన నటించే నటననే ప్రేక్షకులు నటన అనుకున్నారు. చిరు లా నటిస్తే చాలు ఎవరైనా స్టార్ హీరో కావచ్చు అని ఆయనను చాలా మంది హీరోలు కాపీ కొట్టడానికి ప్రయత్నించారు. దాంతో చిరు కి ఆయనకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నటన లో మాత్రమే కాకుండా డాన్స్ పరంగా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.  ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆయనలా డాన్స్ చేసే హీరో లేకపోవడం గమనార్హం.

కొంతమంది యువ హీరోలు డాన్స్ చేసి చిరు లా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఆయన చేసే డాన్స్ ముందు వారు తేలిపోతున్నారు. ఈతరం యువ హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గదు. ఇక మెగాస్టార్ చిరంజీవి పాటలు కూడా పాడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మాస్టర్ సినిమాలో ఆయన తమ్ముడు అరె తమ్ముడు అనే పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు. మణిశర్మ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి పాట పాడించాలని ఐడియా కూడా ఆయనదే. 

ఆ తర్వాత మృగరాజు చిత్రంలో చాయ్ చమక్కులు చూడరా అనే పాటను కూడా చిరంజీవి పాడడం విశేషం. ఇలా తనలోని అన్ని టాలెంట్ ను చూపించి తెలుగు ప్రేక్షకులకు కాకుండా దేశవ్యాప్తంగా అందరూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మెగాస్టార్. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ప్రేక్షకులకు ఇంకా తనలోని టాలెంటుతో అలరిస్తూ ఉండాలి అని కోరుకుందాం. ఇక ఈ రెండు పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ పాటల కోసమే కోట్లాది మంది ప్రేక్షకులు ఆయన సినిమాలకు తరలి వెళ్లారు అని నిస్సందేహంగా గా చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: