తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు త్రిష గురించి తప్పకుండా చెప్పాలి. రెండు దశాబ్దాలుగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది అంటే ఆమె సినిమా పరంగా ఎంతటి దృక్పధాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తొలుత హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రలలో నటించి, సహాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి. ఆ తరువాత హీరోయిన్ గా మారింది త్రిష. అలా తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా అతడు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఈమె తెలుగునాట ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా అవతరించింది. స్టార్ హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఎదురు చూశారు. ఆమె పూర్తిస్థాయి టాప్ హీరోయిన్ కాకముందే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి అంటే త్రిష ఆ టైంలోనే ఎంతటి పాపులారిటీని దక్కించుకుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇక ఆమె కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ కథా చిత్రాలు చేయగా వాటిలో పౌర్ణమి ఆడవారి మాటలకు అర్థాలు వేరులే బుజ్జిగాడు నమో వెంకటేశా బాడీగార్డ్ వంటి చిత్రాలు ఆమెకు ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం మంచి ఫ్యామిలీ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఒకేసారి తమిళ మలయాళ భాషలలో సినిమాలు చేసి భారీ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం చేస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమాలు అన్ని భాషలలో విడుదల అవుతూ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. దక్షిణాదిన టాప్ హీరోయిన్ రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ లో మొదటి స్థానంలో త్రిష ఉంటుంది. అంతేకాదు ఈమెకు స్టార్ హీరోలకు ఉండే స్థాయిలో అభిమానం ఉందంటే నమ్మాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: