
షారుఖ్ తన బాడీ గార్డుకు రాజు అని పేరు పెట్టాడు. రాజు షారూఖ్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తాడు. షారుఖ్ ప్రతి అవార్డ్ షో, సినిమా ప్రమోషన్‌లో రాజు కనిపిస్తారు. అనేక సార్లు అతను షారుఖ్‌తో కలిసి అమెరికాలో కూడా కనిపించాడు. ఎప్పుడూ షారుఖ్ వెన్నంటే ఉంటూ ఆయన నీడలా తన పని చేస్తాడు. తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ తన బాడీగార్డ్‌కు రూ.2.7 కోట్ల జీతాన్ని చెల్లిస్తాడు. రవి సింగ్ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీ గార్డులలో ఒకరు. షారూఖ్ ఖాన్‌తో కలిసి జీవిస్తున్నప్పటికీ రవి బాలీవుడ్ వెలుగులకు దూరంగా ఉంటాడు.
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'పఠాన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన దీపికా పదుకొనేతో ఈ సినిమా షూటింగ్ కోసం అతి త్వరలో స్పెయిన్ వెళ్లనున్నాడు. ఓ భారీ బడ్జెట్ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించబోతున్నారు. దీని కోసం సినిమా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో కన్పించబోతున్నారు. జాన్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.