మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ తరువాత చేసే సినిమాలపై మెగా అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. దానికి కారణం అయన ఎంచుకున్న కథలే. ప్రస్తుతం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకొని వున్నారు. ఈ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. rrr లో అల్లూరి సీతారామరాజుగా, ఆచార్యలో మరో ముఖ్య పాత్రలో చరణ్ నటించాడు. ఈ రెండు సినిమాల తరువాత రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో సినిమా చేయనున్నారు. శంకర్ తో చేయనున్న సినిమా రామ్ చరణ్ కు 15వ చిత్రం. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందనున్నారు.  స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ రానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో 'అపరిచితుడు 2' పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. అయితే రణ్వీర్ ఈ కార్యక్రమానికి వస్తున్నారా లేదా అనేది ఇంకా అధికారకంగా తెలియాల్సి ఉంది. శంకర్ - రామ్ చరణ్ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా పక్క పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న ప్రాజెక్ట్ అని కొందరు అంటుంటే.. మరొకొందరు మాత్రం చరణ్ స్టూడెంట్ లీడర్ పాత్ర చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి వివిధ కారణాలు, వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందు ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు. అయితే తాజా సమాచారం ఏంటంటే శంకర్ చరణ్ సినిమాని అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే దిల్ రాజు ప్లాన్ చేసుకొని రెడీగా వున్నారు. దీంతో రామ్ చరణ్ నుంచి వచ్చే తరువాత మూడు సినిమాలు అతని కెరీర్ ను టర్నింగ్ చేయనున్నామని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: