టాలీవుడ్ హీరోస్‌లో కమర్షియల్ యాడ్స్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది సూపర్ స్టార్ మహేశ్ బాబే అని చెప్పొచ్చు. అందరి కంటే కూడా ఎక్కువ యాడ్స్‌లో ఇప్పటి వరకు ప్రిన్స్ మహేశ్ నటించారు. సోలో యాడ్స్ మాత్రమే కాకుండా వేరే హీరోలతో కలిసి కూడా నటించాడు. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘థమ్సప్’ యాడ్‌లో కనిపించిన మహేశ్..తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఫాస్ట్ మూవింగ్ కంజూమర్ గూడ్స్ అయిన మౌత్ ఫ్రెషనర్ ప్రొడక్ట్ కోసం ఈ యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే యాడ్ షూట్ పూర్తి కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి ఇన్ స్టా గ్రామ్‌లో విడుదల కాగా, అది నెట్టింట వైరలవుతోంది. ప్రోమోలో మహేశ్, టైగర్ ష్రాఫ్ తమదైన గెటప్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కాగా, ఈ యాడ్‌లో నటించేందుకుగాను మహేశ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఉంటారనే చర్చ నడుస్తోంది. అయితే, సినిమాల కంటే కూడా మహేశ్‌కు బ్రాండ్ ప్రమోషన్స్‌తోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నట్లు పలు నివేదికలు గతంలో పేర్కొన్నాయి.
మహేశ్ ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు, మహేశ్ బ్యాంకర్‌గా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో సూపర్ స్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమాపైన అంచనాలను ఇంకా పెంచేసింది. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మహేశ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. గతంలో మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు, ఖలేజా’ చిత్రాలు వచ్చాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి