తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదలై.. ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వాళ్లలో 6 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు లోబో.బిగ్ బాస్ లోకి రాకముందు లోబో చాలామందికి తెలియదు.కానీ ఇతను హౌస్ లోకి వచ్చాక..అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు.దీంతో లోబో గురించి తెలుసుకోవడానికి చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.అయితే లోబో గురించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లోలో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం.

అతను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు.దీంతో అతనికి టీసీ ఇచ్చి పంపించేశారు.దాంతో లోబో కి సరిగ్గా చదువు అబ్బలేదు.అయితే తర్వాత ఓ టాటూ షాప్ లో పని చేయడం మొదలు పెట్టాడు లోబో.ఈ క్రమంలోనే తన మొదటి టాటూని లోబో ఓ రష్యన్ అమ్మాయికి వేసాడు.ఇక ఆ అమ్మాయి మనోడి వేషధారణ చూసి అవాక్కయ్యి 'లోబో' అనే పేరుని పెట్టింది.అప్పటి నుంచి లోబో అనే పేరునే కంటిన్యూ చేసాడు. ఇక ఇతను పక్కా హైదరాబాదీ అనే విషయం అందరికీ తెలిసిందే.ఇక మొదట స్టార్ మా మ్యూజిక్ లో యాంకర్ గా పని చేసాడు లోబో.అంతేకాదు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.

అయితే లోబోకి ఆస్తులు కూడా ఎక్కువే అని తెలుస్తోంది.అతనికి హైదరాబాద్ సమీపంలో కొన్ని ఖరీదైన ప్లాట్లు ఉన్నాయి.ఓ bmw కారు కూడా ఉందట.అయితే ఈ విషయాలను అతని సోదరుడు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.అతను పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ విషయాలను వెల్లడించాడు.ఇక లోబో గురించి అతని సోదరుడు ఇర్ఫాన్ మాట్లాడుతూ..లోబో ది చిన్న పిల్లాడి మనస్తత్వం అని..అతనికి కోపం అంతే వేగంగా వస్తుందని..కానీ అది ఎక్కువ సేపు ఉండదని..బిగ్ బాస్ లో అతను లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఉండదని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్.మొత్తానికి మన లోబో మాములు వ్యక్తి కాదన్న మాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: