టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అప్ కమింగ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకడు. పేపర్ బాయ్ అనే సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన సంతోష్.. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబర్చాడు. ఇక గత్ ఏడాది 'ఎక్ మినీ కథ' అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఓటిటిలో విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇక దీపావళి కానుకగా ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఈ హీరో నటించిన 'మంచిరోజులు వచ్చాయి' అనే సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని థియేటర్లో రిలీజ్ కాబోతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ను పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఇక తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో లో పాల్గొన్న హీరో సందర్భంగా సంతోష్ శోభన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో హీరోలందరూ రొమాంటిక్ సినిమాలు అవలీలగా చేసేస్తున్నారని తను మాత్రం ఆ విషయంలో కాస్త వీక్ అని చెప్పుకొచ్చారు. అన్నిటికంటే లిప్ లాక్ సన్నివేశం ఇంకా కష్టమన్నారు. తనకు కాస్త సిగ్గు ఎక్కువ అంటూ అన్ని సినిమాల్లో చేసినట్టుగానే లిప్ లాక్ సీన్ లో కూడా నటించాలని తెలియజేశారు.

 సెట్ లో అంత మంది ఉండగా లిప్ లాక్ మూమెంట్ చేయడం కష్టమని అసలు అది కల్చర్ కూడా కాదని ఆయన ఉద్దేశం. అలాంటప్పుడు అలాంటి సన్నివేశాలు అంటే కొంచెం కష్టమే అన్నారు సంతోష్. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు మాత్రం కొంచెం ప్రొఫెషనల్గా టెక్నికల్ చేసినప్పుడే వర్క్ ఈజీ అవుతుందని అని సంతోష్ చెప్పారు. నందిని రెడ్డి డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉండబోతోందని తెలియజేశారు. అంతేకాదు యూవీ క్రియేషన్ లో మరో సినిమా చేయబోతున్నట్లు మరికొన్ని సినిమాలు చర్చలో ఉన్నట్లు ఇక సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: