హీరోయిన్లకు సోదరిగా నటించి మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ పూనమ్ కౌర్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈమే వెండితెరకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఇక ఇదే తంతులు ఆమె ఎక్కువగా సామాజిక అంశాల పైనే స్పందిస్తూ ఉంటుంది.

తాజాగా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసి తిరిగి డిలీట్ చేసింది. దీంతో ఇప్పుడు విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ విషయం ఏమిటంటే ఈమె విడాకులపై స్పందించి కొన్ని వాక్యాలను తెలియజేసింది. అలా తెలియజేసిన కొద్దిసేపటికే ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అయితే పూనమ్ కౌర్ ఈ విషయంపై స్పందించడంతో పలువురికి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విడాకులు తీసుకున్న తరువాత మగవారికి బాధ నిజంగానే ఉంటుందా? లేదంటే ఆడవారికి ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయా అనే విషయంపై ఆమె కామెంట్ చేసినట్లుగా అక్కడ కనిపిస్తోంది. మగవాళ్లే ఆడవాళ్ళని ఎక్కువగా మాటలతో బాధ కలిగిస్తారు అని, మగవాళ్ళ వల్ల ఎప్పుడు ఆడవారికి కష్టాలు వస్తుంటాయి అని తెలియజేసింది. అంతే కాకుండా ఈ సమాజం ఎప్పుడూ పక్షపాతం తోనే వ్యవహరిస్తూ ఉంటుంది. అని తెలియజేసింది.


విడాకుల విషయంలో మనం ఎప్పటికీ పూర్తిస్థాయిలో ఏ విషయాన్ని అర్థం చేసుకోలే ము అని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే ఇలా చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆమె తిరిగి ఆ పోస్టును డిలీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి కలిగించింది. అయితే ఈమె అలా ఎందుకు చేసింది అనే ఉద్దేశం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఈమెకు విడాకుల విషయంపై ఎందుకు అని నెటిజన్లు అడుగుతున్నారు. మరికొంతమంది ఈమె చేసిన పోస్టుని వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: