మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు, అదే జోష్ ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను 11 ఫిబ్రవరి 2022 న విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమాతో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లను శర వేగంగా పూర్తి చేస్తున్న రవితేజ మరి కొన్ని రోజుల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే ధమాకా సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పెళ్లి సందD హీరోయిన్  శ్రీ లీల ను చిత్ర బృందం ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక సాంగ్ కోసం ఈషా రెబ్బ ను చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధమాకా సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కన్ఫ్యూజన్ కామెడీ ని క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. రవితేజ పాత్ర నిజం గానే డ్యూయల్ రోల్ నా.?  లేక ఒకే పాత్రలో డిఫరెంట్ వేరియషన్స్ లో చూపిస్తారా.? అన్నది ఇంటర్వెల్ వరకు తెలియదట. దర్శకుడు చెప్పిన ఈ పాయింట్ నచ్చే రవితేజ ఈ స్క్రిప్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: