
ఎయిడ్స్ జాగో
2007లో వచ్చిన 'ఎయిడ్స్ జాగో' సినిమాలో నాలుగు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇందులో ప్రముఖ దర్శకులు విశాల్ భరద్వాజ్, మీరా నాయర్, ఫర్హాన్ అక్తర్ మరియు సంతోష్ దర్శకత్వం వహించిన 'మైగ్రేషన్', 'బ్లడ్ బ్రదర్స్', 'పాజిటివ్' మరియు 'స్టార్ట్' లఘు చిత్రాలు ఉన్నాయి. షైన్ అహుజా, ఇర్ఫాన్ ఖాన్, సమీరా రెడ్డి, రైమా సేన్, అయేషా టకియా మరియు పంకజ్ కపూర్ వంటి కళాకారులు ఈ షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు.
ఫిర్ మిలేంగే
ఎయిడ్స్ గురించి మాట్లాడితే మొదట గుర్తుకు వచ్చే పేరు ఫిర్ మిలేంగే. అది 2004లో వచ్చిన చిత్రం. ఇందులో సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి, అభిషేక్ బచ్చన్ నటించారు. ఈ సినిమా ద్వారా ఎయిడ్స్‌పై తప్పుడు అభిప్రాయం ఏర్పడింది.

ఓనిర్ దర్శకత్వంలో 2005లో విడుదలైన చిత్రం ఇది. ఇందులో సంజయ్ సూరి, జూహీ చావ్లా ప్రధాన పాత్రలు పోషించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో స్వలింగ సంపర్కం, ఎయిడ్స్ వంటి వ్యాధులను చాటి చెప్పిన చిత్రం 'మై బ్రదర్ నిఖిల్'.

ఈ చిత్రానికి శ్రీధర్ రంగయన్ దర్శకత్వం వహించారు. 2007లో వచ్చిన ఈ చిత్రం హెచ్ఐవీ కారణంగా చిన్న చూపు చూసే వెనుకబడిన వర్గాల ప్రజల కష్టాలను కళ్ళకు కడుతుంది.

సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన 10 లఘు చిత్రాల సేకరణ. 2007ల వచ్చిన ఈ చిత్రంలో దియా మీర్జా, మనోజ్ బాజ్‌పేయి ఇందులో నటించారు. ఇది పూర్తిగా ఎయిడ్స్‌పై ఆధారపడి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
