దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నుండి ఏదైనా మూవీ వస్తుంది అంటే చాలు ఆయన సినిమా చేస్తున్న హీరోల ఫ్యాన్స్ తోపాటు ప్రత్యేకంగా రాజమౌళి అభిమానల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి అనేది తెల్సిందే. ఆ విధంగా తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఒక్కొక్కటిగా వరుసగా సక్సెస్ లు అందుకుంటూ ఇటీవల బాహుబలి సిరీస్ సినిమాలతో టాలీవుడ్ లో అపజయమెరుగని దిగ్గజ దర్శకుడిగా మన దేశంతో పాటు విదేశాల్లోని ఆడియన్స్ లోకూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు రాజమౌళి.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆయన తీస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. డివివి దానయ్య తీస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ఆ మూవీ హీరోలు, హీరోయిన్ తో సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టిన రాజమౌళి, సినిమాని వీలైనంత ఎక్కువగా ప్రేక్షకాభిమానులను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నట్లు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు రాజమౌళి. ఇక ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మించనుండగా ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.

అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రాజమౌళి, మీడియా వారు అడుగుతున్న ప్రతిసారి తన నెక్స్ట్ మూవీ మా మహేష్ తో చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప అది ఎప్పుడు మొదలయ్యే ఛాన్స్ ఉందనేది మాత్రం వెల్లడించడం లేదని, ఇప్పటికే ఆ భారీ సినిమా కోసం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తమకు రాజమౌళి ఈ విధంగా వ్యవహరించడం తగదని, ఇకనైనా సినిమా ప్రారంభం గురించి గుడ్ న్యూస్ చెప్పాలని కోరుతూ కొందరు మహేష్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ కోరుతున్న విధంగా సూపర్ స్టార్ తో తన సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాన్ని జక్కన్న ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: