తెలుగమ్మాయి ఈషా రెబ్బ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ది పెద్ద క్యారెక్టర్ కాకపోవడంతో ఈ సినిమా ద్వారా ఈషా రెబ్బ కు పెద్దగా అవకాశాలు మాత్రం టాలీవుడ్ లో దక్కలేదు. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో నటించింది, ఈ సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు, అలాంటి సమయంలోనే ఈషా రెబ్బ నటించిన అమీ తుమి  సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 ఇలా టాలీవుడ్ లో అమీ తుమి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఈశా రెబ్బ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది, ఈమధ్య ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహ లో త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది. అయితే తాజాగా కూడా ఈషా రెబ్బ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే క్లాస్ లుక్ ఉన్న వైట్ డ్రెస్ ను తరించింది, ఇలా అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న ఈశా రెబ్బ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: