తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు.వాటిల్లో ''మారన్'' సినిమా ఒకటని చెప్పాలి. యువ దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ సరసన 'మాస్టర్' బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది.ధనుష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన 'మారన్' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని అంతా భావిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.''మారన్'' సినిమాని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ డీల్ కూడా కుదుర్చుకున్నారని టాక్ అనేది నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ధనుష్ హీరోగా నటించిన 'జగమే తంత్రం' 'అట్రాంగిరే' వంటి సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో 'మారన్' సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకు వస్తుందేమో చూడాలి.కాగా 'మారన్' సినిమాని ఎమోషన్ యాక్షన్ థ్రిల్లర్ గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ ఇంకా అలాగే మాళవిక ఇద్దరూ కూడా జర్నలిస్టులుగా కనిపించనున్నారు. విలక్షణ నటుడు సముద్రఖని  ఇంకా అలాగే మహేంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సెంధిల్ త్యాగరాజన్ ఇంకా అలాగే అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న ధనుష్ ఈ సినిమాతో ఎటువంటి విజయం అందుకుంటాడో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: