
అదే సమయంలో ఎంతో మంది హీరోయిన్లు అందాల ఆరబోత చేస్తూ ఉంటే ఈ అమ్మడు మాత్రం అందాల ఆరబోత విషయంలో లిమిటేషన్స్ పెట్టుకుంది. ఒకవైపు ఈ అమ్మడు నటించిన సినిమాలు హిట్ కాకపోవడం.. మరో వైపు అందాల ఆరబోత చేయకపోవడంతో అనుపమ పరమేశ్వరన్ కి టాలెంట్ వున్న ప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం కాస్త తక్కువయ్యాయి అని చెప్పాలి. దాదాపు రెండేళ్ల నుండి తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవలే రౌడీ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది.
కెరియర్ మొదటి నుంచి అందాల ఆరబోతకు దూరంగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం లిప్ లాక్ కి సిద్ధమైపోయింది. యువ హీరో కి లిప్ లాక్ చేసి అనుపమ ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ సినిమా కోసం ఏకంగా 50 లక్షల పారితోషికం అందుకుందట. ఒక్కో సినిమాకి 30 లక్షల లోపు మాత్రమే అనుపమ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుంది. కానీ రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ సీన్ లతోపాటు ఇంటిమేట్ సీన్ కూడా ఉంటుంది. అందుకే ఇక ఈ సినిమాకి కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.