బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సుస్వాగతం సినిమా తో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ తర్వాత బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమా తో ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ సినిమాని తెరకెక్కించాడు, ఈ రెండు సినిమాలు కూడా బండ్ల గణేష్ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి, ఆ తర్వాత తన అభిమాన నటుడు అయిన పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ ఈ సినిమాతో బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు, ఆ తర్వాత కూడా బండ్ల గణేష్ టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు.

  ప్రస్తుత కాలంలో మాత్రం సినిమాలు నిర్మించడం లో బండ్ల గణేష్ కాస్త స్లో అయ్యాడు, ఆఖరుగా బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బండ్ల గణేష్ డేగల బాబ్జీ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమా కథ అంతా ఒకే గదిలో రెండు గంటల పైగా నడుస్తోంది.  ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యిన ఉత్త సిరుప్పు సీజ్ 7 మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది, ఈ మూవీ ని హిందీలో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తున్నాడు, ఇలా బండ్ల గణేష్ డేగల బాబ్జి సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది, మరి ఇలా హీరోగా మారిన బండ్ల గణేష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: