మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమా కోసం ఏదైతే అవసరమో దాన్ని తప్పకుండా తీసుకు వస్తాడు. ఆ విధంగా ఇప్పటివరకు ఆయన తన సినిమాల కోసం ఎంతో మంది సీనియర్ నటి మణులను ఎంతో మంది పెద్ద నటులను తీసుకువచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. చిన్న చిన్న పాత్రల కోసం భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకు వస్తూ ఉంటాడు. అలాగే ఇతర భాషల్లోని సీనియర్ స్టార్స్ ను తీసుకు రావడానికి కూడా ఆయన ఏమాత్రం వెనుకాడరు.

కథకు ఎవరైతే డిమాండ్ చేస్తారో వారిని తీసుకు వస్తాడు. అలా తన ప్రతి సినిమాలో ఓ పవర్ఫుల్ లేడీ పాత్ర ను క్రియేట్ చేస్తూ ఆ పాత్రలో సీనియర్ నటీమణులను నటింపా చేస్తూ అందరికి వారినీ గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలను పరిశీలిస్తే ప్రతి సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్స్ ఉంటారు అనేది మనకు అర్థం అవుతుంది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా ఓ కీలక పాత్రలో నటించగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ అజ్ఞాతవాసి సినిమా ఖుష్బూ లో అరవింద సమేత సినిమా లో దేవయాని అల వైకుంఠపురం లో సినిమాలో టబు వంటి సీనియర్ నటీమణులు కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను కనువిందు చేశారు.

అలా తాజాగా త్రివిక్రమ్ చేస్తున్న మహేష్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం శోభన రంగంలోకి దింపుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో పిన్ని పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుందట. అంతేకాదు ఎంతో హుందాగా కూడా ఉంటుందట. దాంతో ఈ పాత్రకు ఆమె చాలా బాగుంటుందని ఆమెను ఎంపిక చేస్తున్నట్లు గా తెలుస్తుంది. పాత తరం కథానాయికగా ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు  ఆమె తెలుగులో మళ్లీ సినిమా చేయాలని కోరుకుంటున్నా అభిమానులు చాలామంది ఉన్నారు. మరి ఈ సినిమా వారి కోరికను తీరుస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: