ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలు చేసే హీరోల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఈ మార్కెట్లో ఎదిగిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ అయితే తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆలచిస్తున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా రేంజ్ ని మార్చేస్తున్న ఈ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ను నేషనల్ వైడ్ సినిమా ఇండస్ట్రీ గా మార్చేస్తున్నారు.

తమ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ లు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే చేస్తూ అన్ని నగరాలకు వెళుతూ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో హుషారు తనాన్ని చూపిస్తున్నారు. పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ లో కూడా వారు పాల్గొంటున్నారు. అక్కడ హిందీ లో మాట్లాడి మన హీరోలు వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా మాట్లాడడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు వీరు. ఆ విధంగా తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళుతున్న మన స్టార్ హీరోలు నేషనల్ వైడ్ గా భారీగా మార్కెట్ ఉన్న హీరోలు  కాబట్టి ప్రమోషన్స్ కూడా అన్ని ఏరియాలలో చేయాల్సి ఉంటుంది.

అంతే కాదు హిందీ లో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సౌత్ హీరోలకు హిందీ తెలియడం కాస్త తక్కువే అయినా కూడా హిందీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ప్రభాస్ వంటి హీరోలు అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నార్త్ సైడ్ హిందీ మాట్లాడడం కొత్త వెరైటీ గా ఉంటుంది. సౌత్ లో కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కావాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా రాబోయే రోజులలో మన హీరోలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడి వారికి దగ్గర అవుతారో చూడాలి. ప్రేక్షకులు కూడా ఒకసారి మనం అనుకున్న తర్వాత సదరు హీరోను ఏమాత్రం వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇండియా హీరోల కష్టాలు ఇంకెంతగా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR