దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగా నందమూరి ఫ్యాన్స్ లో మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి, కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వాస్తవిక అంశాలతో పాటు కొన్ని కల్పిత అంశాలు కూడా కలగలిపి రాజమౌళిమూవీ తీసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కొన్ని నెలల క్రితమే షూటింగ్ జరుపుకున్న ఆర్ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే పలుమార్లు కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాని మార్చి 25న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు యునిట్ సిద్ధం అయింది. ఇక ఆ రోజు కోసం ప్రేక్షకాభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా పేట్రియాటిక్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, మొదటి నుండి అందరిలో ఈ స్థాయిలో అంచనాలు ఏర్పరుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాని ఎంతో అత్యద్భుతంగా గ్రాండ్ లెవెల్లో రాజమౌళి తెరకెక్కించారని, ఇక సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే అంశాలు అనేకం ఉన్నాయని ఇన్నర్ వర్గాల సమాచారం. ముఖ్యంగా గతంలో రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలకి పదింతలు అనే రేంజ్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంతో గొప్పగా రూపొందిందని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ అందరి అంచనాలు మించి పోవడం ఖాయం అంటున్నారు. మొత్తంగా అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: