ఉప్పెన సినిమాతో భారీ స్థాయిలో హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆయన తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. తొలి సినిమాతో విజయం అందుకుని రెండో సినిమాకు ఆయన ఇంతటి స్థాయికి ఉన్న హీరోతో సినిమా చేయాలనుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఆ విధంగా అందరూ ఆశ్చర్య పోయే విధంగా ఎన్టీఆర్ 30 కోసం బుచ్చిబాబు దర్శకుడు గా ఎంపిక కావడం నిజంగా ఒక విషయం అని చెప్పాలి.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ప్లాన్ వేసుకున్నారట యూనిట్. దానిలో ఎన్టీఆర్ నటించిన పాత్ర ను కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అక్కడ ఎన్టీఆర్ కనిపించిన తీరు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. క్లాస్ మాస్ కలగలిపిన లుక్  ఎన్టీఆర్ సినిమా కోసమే అని చెబుతున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ఈ విధంగా మేకోవర్ అవుతారని కూడా ఎవరూ అనుకోలేదు.

కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో దాని కంటే ముందే ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది అంటున్నారు. కొరటాల శివ మరియు బుచ్చిబాబు సినిమాలు రెండూ కూడా ఒకే సారి చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు కానీ ఎంత వీలైతే అంత త్వరగా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్సినిమా లుక్ అనేది పక్కన పెడితే నందమూరి అభిమానులను ఇది బాగా ఆకట్టుకుంటుంది. ఆయన టెంపర్ సినిమా లో కనిపించిన విధంగా ఇప్పుడు సరి కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ఆర్ఆర్అర్ చిత్రం తర్వాత అంతటి స్థాయి క్రేజ్ ను  అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: