హీరోయిన్ తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడు కూడా కేరాఫ్ అడ్రస్. తాప్సీ పన్ను బబ్లీ బ్యూటీ మాత్రమే కాదట బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ కూడా. అందుకే, ఆమె ఎప్పుడు ఏ కామెంట్ చేసినా కూడా మీడియా చెవులు రిక్కించి మరీ వింటుంది.తాప్సీ ఎప్పుడు కూడా ఆడవారిని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించ లేదు. ఎప్పుడు కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తుంది. ఒక పాత్ర నచ్చిందంటే ఆ పాత్రకు తనవంతు కష్టం చేస్తుంది. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాఘవేంద్రరావుపైనా ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది తాప్సీ.

ఝుమ్మంది నాదం' సినిమాలో తాప్సీ నటించగా, ఆ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో తాప్సీని చాలా గ్లామరస్‌గా చూపించాడు మన దర్శకేంద్రుడు.


ఓ సన్నివేశంలో అయితే హీరోయిన్ బొడ్డు మీద కొబ్బరి కాయ పగులుతుంది. అసలు అందులో సెక్సప్పీల్ ఏముందో నాకు అర్థం కాలేదంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం కాగా, ఆ తర్వాత తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇవ్వడంతోపాటు క్షమాపణ కూడా చెప్పిందట.

నటీనటుల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు ప్రదర్శిస్తున్న పక్షపాత ధోరణిపైనా అలాగే మేల్ డామినేషన్ మీదా తాప్సీ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది. థియేటర్లలో సీట్లను బట్టి నటీనటుల రెమ్యునరేషన్ ఫిక్స్ అవుతుంటుందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది తాప్సీ.

ఇక్కడ ఆమె ఉద్దేశ్యపూర్వకంగానో ఇంకో ఉద్దేశ్యంతోనే ప్రేక్షకుల 'పిరుదుల' ప్రస్తావన అయితే తీసుకొచ్చింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు వుండవనీ, కేవలం మౌత్ టాక్ ద్వారానే వుంటోందనీ, ఆ కారణంగానే హీరోయిన్లకు రెమ్యునరేషన్ తక్కువన్నది తాప్సీ చెబుతుంది. ఆమె ఆవేదనలో కొంత నిజం వున్నా కానీ ఆమె వాడే భాష మాత్రం అభ్యంతరకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: