నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని టాప్ యంగ్ హీరోలలో సీనియర్. ఇప్పటికి కూడ కళ్యాణ్ రామ్ హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. హీరోగా రాణించాలి అన్న తపనతో కనీసం సంవత్సరానికి ఒక సినిమాలో చేస్తూనే ఉన్నాడు. ఆసినిమా జయాపజయాల గురించి పట్టించుకోడు.



సినిమాల పై కళ్యాణ్ రామ్ కు ఉన్న విపరీతమైన మోజుతో ఆర్థికంగా అతడికి నష్టాలు వచ్చినా పట్టించుకోడు. ‘పటాస్’ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ ఏ సినిమాలలో నటించాడో కూడ ప్రేక్షకులకు గుర్తులేదు. అతడు నటించిన అతడు నటించిన ‘ఎంత మంచివాడవురా’ విడుదలై మూడు సంవత్సరాలు అయింది. ఇక చిన్న సినిమాలతో లాభం లేదని ఈసారి కళ్యాణ్ ఒక భారీ సినిమాను తలకేత్తుకున్నాడు.



‘బింబిసార’ అన్న టైటిల్ తో చరిత్రలో కథలు కథలుగా చెప్పుకునే కిరాతకుడు. చెంగిస్ ఖాన్ ఎదిరించిన బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ నటిస్తున్నాడు. వాస్తవానికి ఈమూవీ బడ్జెట్ కళ్యాణ్ రామ్ మార్కెట్ కు మించి ఉంటుంది. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ ధైర్యంగా ఈమూవీని చేస్తున్నాడు. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా కళ్యాణ్ రామ్ తీసున్నాడు. ఈమూవీ ఇప్పటికే విడుదల కావలసి ఉంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈమూవీ విడుదల ఆలస్యం అయింది. ఇప్పుడు ఈమూవీని వచ్చేనెలలో లేదంటే మే నెలలో విడుదలచేయాలని ప్రయత్నిస్తున్నారు.


ఈసినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈమూవీకి సంబంధించిన రీ రికార్డింగ్ బాధ్యతలను కీరవాణీ కి అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీలో ‘మగధీర’ లోని ‘ధీరధీర’ స్థాయిలో ఒక పాటను కూడ కీరవాణి చేత ప్రత్యేకంగా కంపోజ్ చేయించి ఆ పాటను కూడ ఈమూవీలో చిత్రీకరిస్తారట. భారీ సెట్స్ భారీ గ్రాఫిక్ వర్క్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ కళ్యాణ్ రామ్ కెరియర్ కు అత్యంత కీలకం. ఈమూవీ విడుదల తరువాత తన దశ తిరుగుతుందని కళ్యాణ్ రామ్ ఆశిస్తున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: