టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న క్రిష్ సామాజిక స్పృహ ఉన్న కథలను ఎక్కువగా ప్రేక్షకులను మేల్కొలుపుతూ ఉంటాడు. గమ్యం సినిమా తో దర్శకుడిగా మారిన ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించిన తీరు అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే ఇంతటి మంచి సినిమా చేసిన ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఎంతో పొగిడారు. ఆ విధంగా మంచి పేరు సంపాదించుకున్న అయన ఆ తర్వాత కూడా సామాజిక స్పృహ ఉన్న సినిమాలను ఎంపిక చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

కృష్ణం వందే జగద్గురుం, వేదం వంటి సినిమాలతో ఆయన తక్కువ కాలంలోనే దర్శకుడిగా మారాడు అని చెప్పాలి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను తెరకెక్కించిన అయన ఈ చిత్రాల ప్రభావం ఆయనపై పడకపోయినా కూడా కొంత బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. ఆ సినిమా చేయడం ఆయన చేసిన పెద్ద పొరపాటు గా ఆయన అభిమానులు చెప్పారు. అంతకు  ముందు బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా చేసి అందరిని ఎంతగానో అలరించాడు. ఆ విధంగా చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న క్రిష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక చారిత్రాత్మక సినిమా చేయబోతున్నాడు. 

అయితే ఈ సినిమా మొదలవడానికి ఆలస్యం అవుతున్న సమయంలో ఓ నవల ఆధారంగా కొండపొలం అనే సినిమా చేశాడు. అది ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో నిరాశపరిచింది. అంతేకాదు యువ హీరో తో అలాంటి సబ్జెక్ట్ చేయడం పట్ల ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటి సినిమాలు చేయొద్దని అనుకున్నారు. తాజాగా ఆయన మరొకసారి నవల ఆధారంగా సినిమా చేయాలని భావిస్తున్నారు. అయన మరో నవల పై మనసు పడడం దాన్ని సినిమాగా చేస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే భావనలో ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది సినిమా విశ్లేషకులు ఆయనపై కొన్ని సెటైర్లు వేస్తున్నారు. ఈసారి హీరో క్రిష్ కి ఏ హీరో బలవుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. మరి క్రిష్ ఇన్ని అవమానాల మధ్య ఆ సినిమా చేస్తాడా అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: