సమంతకు ఇప్పుడు వరుస బాలీవుడ్ సినిమా అవకాశాలు రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. తెలుగునాట టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సినిమాలు చేయడం తగ్గించడం మళ్ళీ విడాకులు పొందడం మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనీ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఆమె చేసిన బాలీవుడ్ వెబ్ సిరీస్ అలాగే పుష్ప సినిమాలోని స్పెషల్ పాట ఆమెకు మరిన్ని అవకాశాలు రావడానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు.

ఒక్కొక్క అడుగు వేస్తూ తన అందచందాలను ఎరగా వేస్తూ వ్యక్తిగత అవంతరాల తర్వాత ఇలాంటి ప్రణాళిక వేసి బిజీ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేదు.తను చేసే ప్రతి దాన్ని హాట్ టాపిక్ గా మార్చి ఇమేజ్ ను సంపాదించుకుంటుంది. కొంతకాలంగా ఆమె ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాల్లో నటించడానికి కూడా అంగీకరిస్తుంది. ఆ విధంగా తాజాగా ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకి సంతకం చేసిందని సమాచారం. అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా సమంత ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది. ఆమె క్రేజ్ బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ సిరీస్ ద్వారా విస్తరించింది. ఆ కారణం గా ఇప్పుడు ఆమె బాలీవుడ్ సినిమాలలో బిజీ అవడం తో ఆమె అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తుంది. అంతేకాదు తాను గతంలో నటించిన ఓ బేబీ సినిమా నిర్మాతలతో కలిసి హాలీవుడ్ సినిమా కూడా చేయనుంది. అలా ఆమె బిజీ గా ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తో ఆమె ఓ సినిమా చేస్తోంది. ఈ విధంగా తన మునుపటి వైభవం తెచ్చుకునే విధంగా సమంత ప్రయత్నాలు చేస్తుంది . ఆమె ప్రధాన పాత్రలో సినిమాలో చేసిన రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టులను కనుక గమనిస్తే మరో రెండేళ్ల దాకా ఆమె ఊపిరాడని బిజీగా ఉంటుంది అని తెలుస్తుంది. ఏది ఏమైనా తన జీవితంలో జరిగిన ఓ పెద్ద సంఘటన తర్వాత ఇలా కోలుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: