ఘట్టమనేని వారసురాలిగా, మహేష్ బాబు లిటిల్ ప్రిన్సెస్ గా పేరు పొందింది సితార. ఇక తన ప్రతిభ గురించి ప్రతి ఒక్కరికీ చెప్పనవసరం లేదు. తన తండ్రికి తగ్గ తనయురాలుగా గా నెట్టింట బాగా ఫేమస్ అయింది సితార. ఇక తనదైన శైలిలో డాన్స్ వీడియో లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది సితార. ఇక ఇటీవలే కూచిపూడి నాట్య ప్రదర్శన కూడా చేయడంతో మహేష్ బాబు కాస్త గర్వంగా ఫీల్ అయ్యేలా చేసింది. సితార కూచిపూడి నాట్యం చేస్తుంటే సీతమ్మనే దిగివచ్చి నాట్యం చేసేలా అనిపించింది అన్నట్లుగా సమాచారం. ఈ డాన్స్ ఉత్తర ఆడియన్స్ ని బాగా మెప్పించి నట్లు గా తెలుస్తోంది.

ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాలోనూ.. పెన్నీ అనే సాంగ్ లో తన డ్యాన్స్ చేసి అందరిని మైమరిపించే లా చేసింది. ఇక మహేష్ స్టైలిష్ కి ఈ సాంగ్ లో సితార అట్రాక్షన్గా నిలిచింది అని చెప్పవచ్చు.. అయితే ఈ పాట కోసం సీతార ను ఎంపిక చేసిన తర్వాత మహేష్ నమ్రత చాలా టెన్షన్ గా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నమ్రతనే రిలీజ్ చేసినట్లుగా సమాచారం. తన సినిమాలో డాన్స్ వేయడానికి అవకాశం వచ్చిందని సితార కి చెప్పగానే చాలా ఆనంద పడిందట.

అలా తనని ఈ పాటలో భాగం చేశామని తెలియజేసింది నమ్రత. ఇక ఈ పాట కోసం కెమెరా ముందుకు వచ్చి సితార డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కానీ ఎలా చేస్తుందో అని మహేష్ నేను చాలా టెన్షన్ పడ్డాను అని తెలియజేసింది. ఒకవేళ వీడియో సరిగ్గా రాకపోతే తనని ఇందులో నుంచి తప్పిదమని మాట్లాడుకున్నారట నమ్రత మహేష్. కానీ సీతార మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా డాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయానని తెలియజేసింది. ఒకవైపు చదువు ఎక్కడా డిస్టర్బ్ కాకుండా మరొక వైపు కూడా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రాం లో పాల్గొనే అవకాశం కల్పించడం చాలా అరుదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: